హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ఏపీ మాజీ సీఎం వైస్ జగన్‌పై మరో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఫిబ్రవరి 19న గుంటూరు మిర్చి యార్డులో రాజకీయ ప్రసంగాలు చేయడంపై పోలీసులు ఆయనపై కేసు ఫైల్ చేశారు. ఈ మేరకు మంగళవారం గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు వైసీపీ నాయకులకు నోటీసులు అందజేశారు.
జగన్‌తోపాటు వైసీపీ నేత అంబటి రాంబాబు సహా పలువురికి నోటీసులు ఇచ్చారు. తాము పిలిచినప్పుడు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఇటీవల రెంటపాళ్ల పర్యటన సందర్భంగా రైతు సింగయ్య జగన్ కారు కింద పడి మృతి చెందాడనే కారణంతో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా, మృతికి కారణమైన జగన్ బుల్లెట్‌ప్రూఫ్ కారును మంగళవారం పోలీసులు సీజ్ చేశారు.