హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రాగానే తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు స్కీం(Free bus schemem) ఆటో డ్రైవర్లపాలిట(Auto Driver) శాపంగా మారింది. గిరాకీలేక.. బతుకుదారి కనిపించక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలకు(Committed suicide) పాల్పడుతుండటంతో వారి కుటుంబాలు రోడ్డునపడు తున్నా యి. చేసిన అప్పులు కట్టలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా నిజామాబాద్(Nizamabad Dist)జిల్లాలో మరో ఆటో డ్రైవర్ మృతి చెందాడు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన నేనావత్ వినోద్ (27) అనే ఆటోడ్రైవర్ ఫైనాన్స్ ద్వారా ఆటోను కొనుగోలు చేశాడు. దీంతో ఫైనాన్స్ చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన ఫైనాన్స్ వారు ఆటోను తీసుకెళ్లారు. దీంతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడి.. పురుగుల మందును సేవించి చికిత్సపొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వినోద్ మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
నవీపేట మండలంలోని అబ్బాపూర్ తండాకు చెందిన నేనావత్ వినోద్(27) అనే ఆటోడ్రైవర్ ఫైనాన్స్ ద్వారా ఆటోను కొనుగోలు చేశాడు.
ఫైనాన్స్ చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన ఫైనాన్స్ వారు ఆటోను తీసుకెళ్లారు.
దీంతో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడి..… pic.twitter.com/kfDcsb00dh
— Telugu Scribe (@TeluguScribe) July 18, 2024