రామవరం, జనవరి 10: గిరాకీ లేక.. కుటుం బం గడువక.. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. స్థానిక రామవరం వనందాస్ గడ్డకు చెందిన ఎర్రి అవినాశ్ (30) ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటోలకు గిరాకీ లేక ఆర్థిక సమస్యలు తలెత్తాయి. జీవితంపై విరక్తితో అవినాశ్ శుక్రవారం రాత్రి ఇంటికి దగ్గరలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.