దోస్త్‌లో మరో 49,267 సీట్ల భర్తీ
డిగ్రీ కోర్సుల్లో మరో 49,267 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యతగా 35,195 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యతగా 14,072 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు.
- రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తి
- 14 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు చాన్స్
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : డిగ్రీ కోర్సుల్లో మరో 49,267 మంది విద్యార్థులు సీట్లు పొందారు. వీరిలో మొదటి ప్రాధాన్యతగా 35,195 మంది విద్యార్థులు, రెండో ప్రాధాన్యతగా 14,072 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకొన్నారు. శుక్రవారం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ ఆఫ్ తెలంగాణ (దోస్త్) రెండో విడత సీట్లు కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు 14 వరకు ఆన్లైన్లో సెల్ఫ్‌రిపోర్టింగ్ చేసుకొని సీటును రిజర్వ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
నేటి నుంచి మూడో విడత
దోస్త్ మూడో విడత కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభంకానున్నది. విద్యార్థులు రూ.400 చెల్లించి 14 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 1 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక, 14న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 20న సీట్లు కేటాయిస్తారు. 24లోపు మూడు విడతల్లో సీట్లు పొందిన వారు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. 21 నుంచి 24 వరకు ఓరియంటేషన్‌ను నిర్వహించనుండగా, 24 నుంచి డిగ్రీ ఫస్టియర్ క్లాసులు ప్రారంభమవుతాయి.
కోర్సుల వారీగా సీట్లు పొందిన వారు
కోర్సు సీట్లు పొందినవారు
ఆర్ట్స్ 6,307
కామర్స్ 21,255 (బీబీఏ -2,463)
లైఫ్‌సైన్సెస్ 11,944
ఫిజికల్ సైన్సెస్ 9,076
డాటాసైన్స్ (ఏఐఎంల్) 431
డీ -ఫార్మసీ 203
ఇతర కోర్సులు 51
మొత్తం 49,267
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

