రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను విడుదల చేసిన డీజీపీ
DGP Mahender Reddy | రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు
హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు వార్షిక నివేదికను డీజీపీ మహేందర్ రెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రంలో నేరాల శాతం 4.4కు పెరిగిందని పేర్కొన్నారు. సైబర్ నేరాలు 57 శాతం, దొంగతనాలు 7 శాతం, అపహరణలు 15 శాతం పెరిగాయని తెలిపారు. మహిళలపై నేరాలు 3.8 శాతం పెరిగాయని చెప్పారు. హత్య కేసులు 12 శాతం, అత్యాచారాలు 17 శాతం తగ్గాయి. 152 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని తెలిపారు. డయల్ 100 ద్వారా 13 లక్షల ఫిర్యాదులు వచ్చాయన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా 1.1 లక్షల ఫిర్యాదులు రాగా, పోలీసు స్టేషన్లలో 5.5 లక్షల ఫిర్యాదు నమోదయ్యాయని తెలిపారు.
సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. 15 లక్షల మందికి అవగాహన కల్పించామని చెప్పారు. గస్తీ వాహనాలు 7 నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుని సేవలు అందించే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. హాక్ ఐ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో 10 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల ద్వారా 18,234 కేసులు ఛేదించామని స్పష్టం చేశారు. వేలి ముద్రల ద్వారా ఎంతో మంది నిందితులను గుర్తించామని పేర్కొన్నారు. 10 లక్షల మంది అనుమానితుల వేలిముద్రలను సేకరించామని తెలిపారు. కరుడుగట్టిన నిందితులపై పీడీ చట్టం ప్రయోగించి నేరాలు అదుపు చేస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 431 మందిపై పీడీ యాక్ట్ ప్రయోగించామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

