జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం(సరస్వతీ) బరాజ్ ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. మానేరు నది నుంచి 7,700 క్యూసుక్కుల నీరు వస్తుండగా, 4,500 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. ఆలాగే పార్వతి(సుందిళ్ల) బరాజ్ నిండి గేట్లు ఎత్తడంతో నీరు సరస్వతీ బరాజ్‌లోకి వస్తున్నది. దీంతో సరస్వతీ బరాజ్‌లో మరికొన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ఇంజినీర్లు తెలిపారు. బరాజ్‌లో 10.87 టీఎంసీల నీటికి ప్రస్తుతం 08.54 టీఎంసీల నీరు నీల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
350 కిలోల గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
మావోయిస్టు నేత రావుల రంజిత్ లొంగుబాటు
కోహ్లిని మించిన బాబర్ ఆజం.. పాకిస్థాన్ కెప్టెన్ కొత్త రికార్డు
బైక్‌ను ఢీ కొట్టిన లారీ..ఇద్దరు అన్నదమ్ముల మృతి
కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం