Jagtial | వెల్గటూర్, సెప్టెంబర్ 22 : తమ్ముని మృతిని తట్టుకోలేక ఓ అన్న శ్వాస ఆగిపోయింది. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం పాత గూడూరుకు చెందిన రెడ్డిమల్ల నరసయ్య(75) గుండెకు బైపా స్ సర్జరీ చేయించుకున్నాడు.
ఆ తర్వాత అతని ఆరోగ్యం మరింత క్షీణించగా శు క్రవారం రాత్రి మృతి చెందాడు. శనివారం దహన సంస్కారాలు పూర్తి చేసి కుటుంబసభ్యులు ఇంటికి చేరారు. తమ్ముడి మరణంతో కలత చెందిన అతని అన్న వెంకటయ్య (78) మనోవేదనతో మృతిచెందాడు.
అధిక పని ఒత్తిడి కారణంగా ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’లో ఓ ఉద్యోగిని హఠాన్మరణం చెందిందన్న వార్త సర్వత్రా షాక్‌కు గురి చేసింది. తాజాగా ఇలాంటిదే మరో ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఉద్యోగంలో పని ఒత్తిడికి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి బలయ్యాడు. గత కొద్ది నెలలుగా తీవ్రమైన పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కార్తికేయన్(38) గురువారం కరెంట్ షాక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటికి విద్యుత్తు తీగలను చుట్టుకొని కరెంట్ షాక్‌తో అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని తాజంబూర్ పోలీసులు తెలిపారు.
మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిసింది. తమిళనాడులోని పల్లవరంలో 15 ఏండ్లుగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అతడు, పని ఒత్తిడి కారణంగా గత రెండు నెలలుగా తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాడని, ఇందుకు సంబంధించి చికిత్స కూడా తీసుకుంటున్నట్టు పోలీసులు చెప్పారు.