యాచారం, ఏప్రిల్ 21: ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇంటికో ఉద్యోగం, ఎకరాకు 121 గజాల ప్లాటు చొప్పు ఇవ్వాల్సిందేనని, లేకపోతే భూసర్వేను అడ్డుకుంటామని కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరిపల్లి అంజయ్య యాదవ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఫార్మాసిటీ కోసం ఇవ్వని 2,200 ఎకరాలను రైతుల పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే రంగారెడ్డిని గ్రామాల్లో తిరగనిచ్చేదిలేదని హెచ్చరించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే మరో లగచర్ల తరహా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో నేతలు రవీందర్, విజయ్‌కుమార్ పాల్గొన్నారు.