నర్సంపేట, అక్టోబర్ 3 : దేశమంతా గురువారం గాంధీ జయంతిని ఘనంగా జరుపుకోగా, వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ సీఐ దగ్గరుండి జంతుబలి చే యించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై కలెక్టర్ డాక్టర్ సత్యశారద విచారణకు ఆదేశించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నర్సంపేట పట్టణంలో ఏటా జంతుబలి చేయడం ఆనవాయితీగా వస్తున్నది. కానీ, ఈ సారి అక్టోబర్ 2న గాంధీ జయంతి, దసరా ఒకేసారి రావడంతో దేశమంతా జంతుబలిపై నిషేధం విధించారు. గురువారం నర్సంపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో దసరా ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నర్సంపేట టౌన్ సీఐ లేతాకుల రఘుపతిరెడ్డి, టౌన్ ఎస్ఐ రవికుమార్, మరో 12మంది పోలీస్, ఇతర సిబ్బంది అక్కడకు చేరుకొని బందోబస్తు చేపట్టా రు. సీఐ స్వయంగా అక్కడ పర్యవేక్షిస్తూ జంతుబలి జరిపించడంపై స్థానికంగా విమర్శలు వచ్చాయి. ఈ ఘటనపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కాల్వశ్రీరాంపూర్, అక్టోబర్3 : మావోయిస్టులు అడవిబాట వదిలి ఇంటి బా ట పట్టాలని పోలీసులు పిలుపునిచ్చా రు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కిష్టంపేటకు చెందిన మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి కంకణాల రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తల్లి వీరమ్మకు పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ గురువారం పండ్లు, చీర, బియ్యం అందజేశారు. ఆమెను పరామర్శించి.. ధైర్యం చెప్పారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్ ఉన్నారు.