హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై రాష్ట్ర ప్ర భుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇ ప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేర కు 65 ఏండ్లు దాటిన టీచర్లను ఉద్యో గం నుంచి తొలిగించారు. అయినప్పటికీ వారికి రావాల్సిన బెనిఫిట్స్ మా త్రం ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ విషయంపై అంగన్వాడీ టీచర్ల సంఘం నాయకురాలు నల్లభారతి తీవ్రంగా మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్ కింద టీచర్లకు రూ.2 లక్షలు, ఆయా కు రూ. లక్ష కూడా ఇస్తామని హామీ ఇచ్చి, ఇంతవరకు అమలు చేయడంలేదని వాపోయారు. ప్రస్తుతం 35, 700 అంగన్వాడీలలో పనిచేస్తున్న సిబ్బంది పదవీ విరమణ పొందడం తో ఐదు వేలకు పైగా టీచర్లు, ఆయా లు తగ్గిపోయారు. దీంతో ఆయా కేం ద్రాల నిర్వహణ కష్టంగా మారింది. తమ డిమాండ్ల పరిష్కారానికి మం త్రులు, అధికారుల చుట్టు తిరిగినప్పటికీ ప్రయోజనం లేదని అంగన్వాడీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.