హైదరాబాద్, మార్చి 27(నమస్తే తెలంగాణ): అంగన్వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షురాలు నల్ల భారతి ప్రభుత్వాన్ని కోరారు. ఒంటిపూట అంగన్వాడీపై ప్రకటన చేసిన ప్రభుత్వం జీవో జారీపై తాత్సారం చేయడం సరికాదని శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీగా ఉన్న టీచర్స్, హెల్పర్ల పోస్టులు భర్తీచేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు టీచర్లకు రూ. 2లక్షలు, హెల్పర్లకు రూ. లక్ష ఉద్యోగ విరమణాంతర ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. టీచర్లకు రూ. 18వేల వేతనం ఇవ్వాలని కోరారు. మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క చొరవచూపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.