హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ఏపీలో మరో ఐపీఎస్ అధికారి రాజీనామా చేశారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీ(అడ్మిన్)గా పనిచేస్తున్న సిద్ధార్థ్ ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం దరఖాస్తు చేశారని పోలీసువర్గాలు తెలిపాయి.
సిద్ధార్థ్ కౌశల్ నెలరోజులుగా విధులకు హాజరు కావడం లేదు. ఒత్తిళ్లతో రాజీనామా చేసినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, స్వచ్ఛందంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.