హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): తనను మించినవారు లేరని చెప్పుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏ మాత్రం తగ్గడం లేదు. తన వ్యాఖ్యలతో అభాసుపాలవుతున్నా, నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతున్నా.. తనదైన మార్క్ సెల్ఫ్ డబ్బాతో దూసుకెళ్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన చంద్రబాబు రైతులకు పట్టాదారు పాస్సుపుస్తకాల పంపిణీ చేసి, మాట్లాడుతూ.. దేశ రాజకీయాల్లో తన కంటే సీనియర్ ఎవరూ లేరని చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో బాబుపై సెటైర్లు పేలుతున్నాయి.
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో మీరే సీనియర్ అంటూ పలువురు చురకలు అంటించా రు. గురువారం రాత్రి ఓ కార్యక్రమంలో బాబు మాట్లాడుతూ.. కోహినూర్ డైమండ్‌ను తాను భారత్‌కు తీసుకు వస్తాననే భ యంతో లండన్ పోలీసులు తనపై నిఘా పెట్టారని అన్నారు. భవిష్యత్తులో కోహినూర్ భారత్‌కు వస్తే, తన వల్లే అ నేందుకు బాబు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు.