స్టాక్ మార్కెట్లు బేజారు.. సెన్సెక్స్ 604, నిఫ్టీ 193 పాయింట్లు డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీలు నష్టాల పాలయ్యాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నష్టాలకు మరింత ఊతమిచ్చాయి.
ముంబై, జనవరి 9 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజూ నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలకు తోడు ఎఫ్ఐఐలు అమ్మకాలకు మొగ్గుచూపడం సూచీలు నష్టాల పాలయ్యాయి. వీటికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నష్టాలకు మరింత ఊతమిచ్చాయి. ఫలితంగా ఇరు సూచీలు ఒక్క శాతానికి పైగా మార్కెట్ వాటాను కోల్పోయాయి. ముఖ్యంగా రియల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఆటో స్టాక్స్‌లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ క్రమంలో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 25 వేల దిగువకు జారుకున్నది.
చివరకు సెన్సెక్స్ 604.72 పాయింట్లు కోల్పోయి 84 వేల దిగువకు 83,576.24 వద్దకు జారుకున్నది. అలాగే 50 షేర్ల ఇండెక్స్ సూచీ నిఫ్టీ సైతం 193.55 పాయింట్లు కోల్పోయి 25,683.30 వద్ద స్థిరపడింది. నష్టాల్లో ప్రారంభమైన సూచీలు చివరి వరకు అదే ట్రెండ్‌ను కొనసాగించాయి. దేశీయ ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 500 శాతం సుంకం విధించనున్నట్టు ప్రకటించడంతో మదుపరుల్లో ఆందోళన నెలకొన్నది. ప్రస్తుతం మార్కెట్లో సెంటిమెంట్ నిరుత్సాహకరంగా ఉన్నదని, ఉద్రిక్త పరిస్థితులకు తోడు ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చనుండటం మదుపరుల్లో ఆందోళన నెలకొన్నదని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.
- ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు రెండు శాతానికి పైగా పతనం చెందాయి.
- వీటితోపాటు అదానీపోర్ట్స్, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా, మహీంద్రాఅండ్ మహీంద్రా, ఇండిగో, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టాటా స్టీల్, టైటాన్ షేర్లు ఒక్క శాతానికి మార్కెట్ వాటాను కోల్పోయాయి.
- అలాగే మారుతి, అల్ట్రాటెక్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్‌యూఎల్, పవర్‌గ్రిడ్, ట్రెంట్, కొటక్ బ్యాంక్, ఎల్అండ్టీ షేర్లు నష్టపోయాయి.
- కానీ ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బీఈఎల్, రిలయన్స్, ఎటర్నల్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ, టీసీఎస్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో ముగిశాయి.
- రియల్టీ సూచీ 2.22 శాతం కోల్పోగా, సర్వీసెస్ 1.84 శాతం, యుటిలిటీస్ 1.82 శాతం, పవర్ 1.79 శాతం, టెలికాం 1.41 శాతం, ఆటో 1.22 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 1.14 శాతం, ఆర్థిక సేవలు 1.09 శాతం పతనం చెందాయి.
- కానీ, ఎనర్జీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగ షేర్లకు మదుపరుల నుంచి మద్దతు లభించింది.
- గత ఐదు సెషన్లలో సెన్సెక్స్ 2,185.77 పాయింట్లు లేదా 2.54 శాతం, నిఫ్టీ 645.35 పాయింట్లు లేదా 2.45 శాతం నష్టపోయింది.
కరిగిపోయిన విదేశీ నిల్వలు
విదేశీ మారకం నిల్వలు మరింత కరిగిపోయాయి. ఈ నెల 2తో ముగిసిన వారాంతానికిగాను 9.80 బిలియన్ డాలర్లు కరిగిపోయిన ఫారెక్స్ రిజర్వులు 686.801 బిలియన్ డాలర్లకు పడిపోయినట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది. గతవారంలో విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ 7.622 బిలియన్ డాలర్లు తగ్గి 551.99 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఇందుకు కారణమని వెల్లడించింది. అలాగే గోల్డ్ రిజర్వులు కూడా 2.058 బిలియన్ డాలర్లు తగ్గి 111.262 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

