జూబ్లీహిల్స్, మే 28: తెలంగాణ రా ష్ట్ర గీతానికి సంగీతాన్ని సమకూర్చే బాధ్యతను సినీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదమని తెలంగాణ సినీ మ్యుజీషియన్స్ అసోసియేషన్ పేర్కొన్నది. ఇది ఎంతమాత్రం సహేతుకం కాదని, తెలంగాణ అస్తిత్వానికి భంగం కలిగిస్తుందని విమ ర్శించింది.
కవి, రచయిత అందెశ్రీ ర చించిన ‘జయజయహే తెలంగాణ’ రా ష్ట్ర గీతంగా ప్రకటించడం సంతోషించే విషయమైనా, ఈ పాటను ఇతర రాష్ర్టాల కళాకారుల గళానికి అప్పగించడం సరైన నిర్ణయం కాదని తెలిపింది.