రాజన్న సిరిసిల్ల : ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla)జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్ వద్ద బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా లాక్ అయి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతతో వ్యవహరించి బస్సును ఆపడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
రాజన్న సిరిసిల్ల – తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ వద్ద సిద్దిపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు స్టీరింగ్ ఒక్కసారిగా లాక్ అయి చెట్ల పొదల్లోంచి దూసుకెళ్లింది.. డ్రైవర్ అప్రమత్తతతో బస్సును ఆపడంతో… pic.twitter.com/nWUDEMLGth
— Telugu Scribe (@TeluguScribe) June 5, 2024