చేర్యాల, జనవరి 31: సిద్దిపేట జిల్లా చేర్యాలలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఎక్సైజ్ సీఐ మహేంద్రకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన రాకేశ్‌కుమార్ ఏడాదిగా చేర్యాల ఆర్టీసీ బస్‌స్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. నిందితుడు ఎక్కువగా ఇదే ప్రాంతంలో పనులు చేసే బీహార్ కార్మికులకు అమ్ముతున్నాడు. నిందితుడి నుంచి 30 ప్యాకెట్లలో 1,200 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్ సీఐ తెలిపారు. రాకేశ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి సిద్దిపేట కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు.