హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం రాష్ర్టానికి రానున్నారు. మధ్యాహ్నం 1:25 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొంటారు.
అనంతరం నోవాటెల్‌లో రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో లంచ్ మీట్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకొంటారు. సాయంత్రం 3:50 గంటలకు హైదరాబాద్ కొంగరకలాన్‌లోని కన్వెన్షన్‌కు చేరుకొని బీజేపీ నేతల సమావేశంలో పాల్గొంటారు.