వినాయక్‌నగర్, జూన్ 23: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఈ నెల 29న నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. పసుపుబోర్డు కార్యాలయాన్ని ప్రారంభించడానికి ఆయన వస్తున్నారని ఎంపీ అర్వింద్ తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని, శాశ్వత భవనం కోసం జడ్పీ కార్యాలయం వెనుక ఉన్న రెండెకరాల స్థలాన్ని కేటాయించాలని కలెక్టర్‌ను కోరినట్టు పేర్కొన్నారు.