తాండూరు రూరల్, నవంబర్ 7 : అత్యవసరంగా ప్రయాణించాల్సిన అంబులెన్స్ వికారాబాద్ జిల్లా తాండూరులోని రైల్వే బ్రిడ్జిపై ఆగిపోయింది. శుక్రవారం తాండూరు నుంచి యాలాల మండలం వైపు అంబులెన్స్ వెళ్లాల్సి ఉండగా, ఉన్నట్టుండి రైల్వే వంతెనపై ఆగిపోయింది. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. ప్రయాణికులు తలా ఓ చేయి వేసి అంబులెన్స్‌ను తోసి పక్కకు జరపడంతో ట్రాఫిక్ క్లియరైంది. అంబులెన్స్‌లకు కనీస మెయింటెనెన్స్ లేకపోవడంతో ఈ దుస్థితి నెలకొందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.