హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని నియమించింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చైర్మన్‌గా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంయుక్త వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మేడి పాపయ్య, జంగా శ్రీనివాస్, వైస్ చైర్మన్లుగా బొలమాల శ్యాంకుమార్, రాజలింగం, దుర్గం రాజేశ్, సభ్యులుగా ఎస్సీ డెవలప్మెంట్ కమిషనర్, గురుకుల సెక్రటరీ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీని నియమించింది.