BRS | పీడితుల సంకెళ్లు తెంచి, జాతికి వేకువలా నిలిచిన నీలి సూర్యుడు అంబేద్కర్. మానవ గౌరవ గీతాన్ని సందేశంగా పంచిన మహామానవుడు అంబేద్కర్. ఆధిపత్యవాదుల ‘మెజార్టీ’ దురహంకారాన్ని తుత్తునియలు చేసి.. బలహీనుడికి గొంతుకనిచ్చిందీ, ఆ హక్కుకు రక్షణ కల్పించిందీ అంబేద్కర్. ఎవరి రాత ఈ దేశ తలరాతను మార్చిందో.. ఆ రాజ్యాంగ నిర్మాత పుట్టినరోజు నేడు. ‘రాష్ట్రం ఏర్పాటుకు పార్లమెంట్ తీర్మానం చేస్తే సరిపోతుంది’ అన్న అంబేద్కర్ మాటే.. తెలంగాణకు బాటలు పరిచింది. అసెంబ్లీలో మెజార్టీ మద్దతు లేకపోయినా తెలంగాణ రాష్ట్రం సాకారమవడానికి కారణమైంది.
బాబాసాహెబ్ బాట.. బీఆర్ఎస్ పోరుబాట.. మూడున్నరకోట్ల జనుల మూకుమ్మడి కాంక్షతోనే రాష్ట్రం సిద్ధించింది. తెలంగాణ రాదేమోనని దిగులు మేఘాలు, అనుమానపు కారుమబ్బులు కమ్ముకున్నప్పుడల్లా.. భవితపై ఆశల్ని రేకెత్తించి, చైతన్యపరిచింది బీఆర్ఎస్. చేతులడ్డుపెట్టి ఉద్యమజ్యోతిని కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్. వలసవాద కుతంత్రాలను ఛేదించి.. ఢిల్లీ పార్టీలను తలవంచేలా చేసింది. అహింసామార్గంలో గెలిచి చూపించింది బీఆర్ఎస్.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకుని ‘చలో వరంగల్’ పోస్టర్‌ను ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే నేతలు ఆదివారం లండన్ బ్రిడ్జి వద్ద ఆవిషరించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్కు అన్ని విధాలుగా అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్ఆర్ఐలు అందరూ ఈ వేడుకల్లో పాల్గొంటున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ విభాగం ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవి, సభ్యులు గణేశ్ కుప్పాల, ప్రదీప్ పులుసు, పవన్ కళ్యాణ్, అజయ్‌రావు గండ్ర తదితరులు పాల్గొన్నారు.
– హైదరాబాద్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభ పోస్టర్‌ను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్‌లోని తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 27న ‘ఎల్కతుర్తి సభకు’ బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
– వేల్పూర్
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ప్రకటిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గానికి చెందిన పలువురు దళితబంధు లబ్ధిదారులు రజతోత్సవ సభ కోసం రూ.2 లక్షల విలువైన చెక్కును ఆదివారం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌కు విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ తన పదేండ్ల పాలనలో సకలజనుల సంక్షేమానికి కృషి చేశారని, ఏ రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు పథకం అమలుతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. సభకు రూ.2 లక్షల విరాళం అందజేసిన దళితబంధు లబ్ధిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. – గోదావరిఖని
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహణకు పలువురు స్వచ్ఛందంగా విరాళం అందజేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ఓగులాపూర్‌కు చెందిన పార్టీ కార్యకర్త అమీర్ తనకు వచ్చే రూ.2వేల పింఛన్‌ను ఆదివారం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌కు విరాళంగా అందజేశారు.
– మల్యాల