ఖైైరతాబాద్, జూన్ 26: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని ప్రారంభించాలని వక్తలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ అభయహ స్తం సాధన కోసం, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌పై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఎమ్మార్పీఎస్ నేతలు ముత్యపాగ నర్సింగ్ రావు, ఇటుక రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని తీసుకొస్తామని, ప్రతి ఒక్కరికీ రూ.12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు. 18 నెలలు గడుస్తున్నా ఆ హామీ ఊసే ఎత్తడం లేదని, ఈ పథకాన్ని ప్రారంభించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు.