హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : ఆన్లైన్ కేంద్రంగా చైనా మాంజా విక్రయిస్తున్న అమెజాన్, మీషో, పతంగ్ డోరీ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం సంస్థలపై కఠినచర్యలు తీసుకోవాలని న్యాయవాది రామారావు ఇమ్మానేని ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్హెచ్ఆర్సీ అమెజాన్, మీషో, పతంగ్ డోరి తదితర సంస్థలపై కేసు నమోదు చేసింది.
ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 31: అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే ఉస్మానియా యూనివర్సిటీల సమస్యలపై చర్చించాలని ఓయూ టీచింగ్, నాన్‌టీచింగ్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బుధవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఓయూ సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.