కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 14 : నీట్-2025 ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అత్యుత్తమ మారులు సాధించారని విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో విద్యార్థులను అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలకు చెందిన విద్యార్థులు వీ శశాంక్‌రెడ్డి 599 మారులు సాధించగా, బీ వర్షిత్ 556, ఆదిబా ఫిర్దోజ్ 553, జే మైథిలి 535, ఎండీ అఫ్నాన్ 513, బీ భువనకృతి 508, ఏ సాత్విక 507, జే అనూష 500 మారులు సాధించినట్టు చెప్పారు.
నీట్ కోచింగ్‌లో డాక్టర్స్-30 ప్రత్యేక కార్యక్రమం ద్వారా కోచింగ్ అందించిన మూడో సంవత్సరంలో అల్ఫోర్స్ విజయ పరంపర కొనసాగుతుందని వెల్లడించారు. ఎనిమిది మంది విద్యార్థులు 500కుపైగా మారులు సాధించడం విశేషమని పేర్కొన్నారు. 100 మంది విద్యార్థులు వివిధ ప్రతిష్ఠాత్మక మెడికల్ కళాశాలల్లో సీట్లు సాధించగలరని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇంతటి విజయానికి తోడ్పడిన అధ్యాపకులు, అధ్యాపకేతర బృందానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు.