హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీ మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొనే దిశగా అడుగులు వేస్తున్నది. కరోనా సంక్షోభ సమయంలో వివిధ మార్గాల్లో నిలిపివేసిన బస్సులను క్రమంగా పునరుద్ధరిస్తున్నది. సెప్టెంబర్ 3 నుంచి నవంబర్ 24 వరకు 359 బస్సులను పునరుద్ధరించింది. మరోవైపు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా కొత్త రూట్లలో 151 బస్సులను రం గంలోకి దింపింది. ఈ 510 బస్సుల ద్వారా రోజూ 1,934 ట్రిప్పు లు నడుపుతున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సాధారణంగా రాష్ట్రంలో రోజూ దాదాపు 9,500 బస్సు లు సగటున 80 వేల ట్రిప్పుల వరకు తిరుగుతుంటాయని ఓ ఒకరు తెలిపారు. ప్రయాణికుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి మరిం త చేరువయ్యేందుకు టీఎస్ఆర్టీసీ ప్రయత్నిస్తున్న ది. సంస్థ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చే పట్టాక ఈ ప్రక్రియ మ రింత జోరందుకొన్నది. బస్సులు కావాలంటూ వచ్చే వినతులపై దృష్టి సారించేందుకు ఆయన ప్రత్యేకంగా కొంతమంది సిబ్బందిని కేటాయించారు.