హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ) : సింగరేణి బొగ్గు బ్లాకుల వేలానికి.. పచ్చజెండా ఊపి వారం తిరక్కముందే విద్యుత్తు వ్యవస్థను అదానీ కంపెనీకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడిందని, ప్రభుత్వ సంస్థలు ఒకొకటిగా ప్రైవేట్‌పరం చే సేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు కంకణం కట్టుకున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పం పిణీ సంస్థల్లో ఫ్రాంచై జీ వ్యవస్థకు విద్యుత్తు సవరణ బిల్లులో కేంద్రం అవకాశం కల్పించింది.
ఈ బిల్లును అమలుచేస్తే ఎఫ్ఆర్బీఎం (ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ చట్టం)తో సుమారు రూ.5 వేల కోట్ల రుణం తీసుకునే అవకాశాన్నిచ్చింది. అయితే, తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం, ఈ విద్యుత్తు సంస్కరణలు అమలు చేయనందుకు నాటి కేసీఆర్ సరారు ఐదేండ్లలో సుమారుగా 25వేల కోట్ల రూపాయలు నష్టపోయింది.
ఇప్పుడు అలవిగాని హామీలిచ్చి అధికారంలోకొచ్చిన కాంగ్రెస్, ఎఫ్ఆర్బీఎం సడలించడంతో వచ్చే ఐదు వేల కోట్ల కోసం కేంద్రం ముందు మోకరిల్లిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకరకంగా తెలంగాణ ప్రజలు, రైతుల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టిందని విమర్శిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లి ఇదే అంశంపై కేంద్రం పెద్దలతో చర్చించారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
దశలవారీగా ప్రైవేటీకరణ?
రాష్ట్రంలోని ప్రధాన ఆదాయ వనరులను క్రమపద్ధతిలో దశలవారీగా ప్రైవేటీకరిస్తారనే సందేహాలు కలుగుతున్నాయి. ఇందులో భాగంగా విద్యుత్ సంస్థలు నష్టాల్లో ఉన్నాయని నమ్మించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు విఫలయత్నాలు చేస్తున్నదని విద్యుత్తురంగ నిపుణులు అంటున్నారు. సంస్థలు నష్టాల్లో ఉంటే నాడు తలసరి విద్యుత్ వినియోగం (పవర్ క్యాపిటా) ఎలా సాధ్యమైందని? ప్రశ్నిస్తున్నారు. కావాలనే విద్యుత్తు సంస్థలు నష్టాల్లో ఉన్నట్టు చూపెడుతున్నారని వాపోతున్నారు.
‘ఒక కుక్కను చంపాలంటే ముందుగా అది పిచ్చిది అనే ముద్ర వేయాలి’ అన్న చందంగా ఇప్పుడు విద్యుత్ సంస్థలపై నష్టాల ముద్రవేసి వాటిని క్రమంగా ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టుగా హైదరాబాద్ పాతబస్తీ బిల్లింగ్‌ను తెరపైకి తెచ్చారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
నాడు దేశం మొత్తం తెలంగాణ విద్యుత్ సంస్థలను పొగిడిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలే ప్రభుత్వ సంస్థలు నష్టాల్లో ఉన్నట్టు చూపితే రాష్ర్టానికి పెట్టుబడులు, కంపెనీలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. విద్యుత్ వ్యవస్థలో ప్రైవేటీకరణ జరిగితే ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడు పడ్డట్టేనని హెచ్చరిస్తున్నారు.
అదానీ ఎవరి ట్రాన్స్మిషన్లు వాడుతారు?
నాడు కేంద్రం తెచ్చిన విద్యుత్ సంస్కరణలను వ్యతిరేకించిన కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు తెలంగాణలో అదానీకి పవర్ డిష్ట్రిబ్యూషన్ను అప్పగించడాన్ని ఎలా సమర్థిస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ‘ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను వదిలేసి బిల్లింగ్ విధానాన్ని అదానికే ఎలా ఇస్తారు? ఏ ప్రాతిపదికన ఇస్తా రు? నాడు వేల కోట్లు ఖర్చు పెట్టి ట్రాన్స్మిషన్ లైన్లు వేసుకున్నం.. రేపు అదానీ ఎవరి ట్రాన్స్మిషన్ లైన్లు వాడతారు? మనవి వాడతారా? కొత్తలైన్లు వేసుకుంటారా?’ అని విద్యుత్తురంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.
బిల్లింగ్‌కు ఓపెన్ టెండర్లు పిలుస్తారా? అసలు టెండర్లు లేకుండానే నామినేషన్ పద్ధతిలో కట్టబెడతారా? అని నిలదీస్తున్నారు. విద్యుత్ వ్యవస్థ ప్రైవేట్ పరమైతే ఎన్నో ఉద్యోగాలు ఊడిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సంస్థ ప్రైవేటీకరణ వల్ల ఉద్యోగాలు రావని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు ఆగమైతాయని అంటున్నారు. వీటికి తోడు నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కూడా కష్టంగా మారే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు.