హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగా ణ): తెలంగాణలో సగానికి పైగా జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పెరుగుతున్న ట్రాఫిక్, అస్తవ్యస్తమై న డ్రైనేజీ వ్యవస్థ.. ఇవన్నీ పట్టణవాసులను ఉకిరిబికిరి చేస్తున్నాయి. ఈ తరుణంలో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖకు భా రీగా ని ధులు కేటాయించి ఊరటనివ్వాల్సింది పో యి, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం నామమాత్ర పు పెంపుతో మమ అనిపించింది. ప్రభుత్వానికి పట్టణాభివృద్ధిపై అసలు చిత్తశుద్ధి ఉన్న దా? అని పట్టణవాసులు నిలదీస్తున్నారు. నిరుడితో పోలిస్తే ఈసారి బడ్జెట్లో మున్సిపల్‌శాఖకు జరిగిన కేటాయింపులు చూస్తే నిర్ల క్ష్యం ఇట్టే అర్థమవుతున్నది. 2025-26 బడ్జెట్లో రూ.17,677 కోట్లు కేటాయించగా, 2026-27లో ఆ సం ఖ్యను రూ.17,907 కోట్లకు మాత్రమే పరిమితం చేశారు.
అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అవసరాల కోసం ప్రభుత్వం అదనంగా విదిల్చింది రూ.230 కోట్లు మాత్రమే. నిరుటితో పోలిస్తే పెంచిన కేవలం 1.3 శాతమే. నిత్యావసరాల ధరలు, నిర్మాణ సామగ్రి రేట్లు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఈ స్వల్ప పెంపు దేనికి సరిపోతుందని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం హ యాంలో ఉన్న వృద్ధి వేగం ప్రస్తుత పాలనలో మందగించినట్టు స్పష్టమవుతున్నది. మూసీ ప్రక్షాళన, మెట్రో రెండో దశ, ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెప్తున్న ప్రభుత్వం, బడ్జెట్ కేటాయింపుల వద్దకు వచ్చేసరికి మొండిచేయి చూపుతున్నది. హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలు పరిషరించేందుకు, కొత్త ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి ఈ నిధులు ఏమాత్రం చాలవని స్పష్టమవుతున్నది.
