కృష్ణా జలాల్లో 50:50 కేటాయించాలి
- తగిన ప్రొటోకాల్ రూపొందించాలి
- శ్రీశైలం ఎండీడీఎల్నూ సవరించాలి
- కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి
హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): నీటి కేటాయింపులు పూర్తయ్యేంత వరకూ కృష్ణా జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు 50:50 నిష్పత్తిలో కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. శ్రీశైలం ప్రాజెక్టు ఎండీడీఎల్‌ను సవరించాలని సూచించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) రూపొందించిన ఆపరేషన్ ప్రొటోకాల్ ముసాయిదాకు కొన్ని సవరణలు సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం లేఖ రాసింది.
కేఆర్ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖలోని ముఖ్యాంశాలు
- శ్రీశైలం ప్రాజెక్టు ఇరిగేషన్ ఎండీడీఎల్‌ను 854 అడుగుల నుంచి 830 అడుగులకు సవరించాలి.
- పోలవరం నుంచి గోదావరి జలాలను మళ్లిస్తున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ఎగువన కృష్ణా జలాలను వినియోగించుకొనే అవసరం ఆంధ్రప్రదేశ్‌కు లేదు. ఈ నేపథ్యంలో 45 టీఎంసీలను క్యారీ ఓవర్ కింద ప్రతిపాదించడం సరికాదు. అదే జరిగితే కేటాయించిన నికర జలాలను తెలంగాణ కోల్పోవాల్సి వస్తుంది.
నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు 72.2 టీఎంసీలను కేటాయించే రూల్‌ను తొలగించాలి. కృష్ణా డెల్టాకు 152.2 టీఎంసీలు కేటాయించగా, అంతకుమించి 181.2 టీఎంసీలు మళ్లిస్తున్నారు. నాగార్జునసాగర్ దిగువన
101.2 టీఎంసీలు అందుబాటులో ఉండగా, మరో 80 టీఎంసీలను గోదావరి ద్వారా మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా విడుదల చేస్తున్న నీటి మొత్తాన్ని తగ్గించాలి. - బచావత్ ట్రిబ్యునల్ 7వ క్లాజ్‌ను అనుసరించి హైదరాబాద్ తాగునీటి అవసరాలకు కేటాయించిన 5.7 టీఎంసీల్లో కేవలం 20 శాతాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
- 75 శాతం డిపెండబులిటి కింద శ్రీశైలంలో 582.5 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని సీడబ్ల్యూసీ లెక్కతేల్చింది. అందులో నాగార్జునసాగర్ అవసరాలకు 300 టీఎంసీలు మినహాయించినా ఇంకా 282.5 టీఎంసీలు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎస్సెల్బీసీ (40 టీఎంసీలు), కల్వకుర్తి (40), నెట్టెంపాడు (25.4), పీఆర్ఎల్ఐఎస్ (90), డిండి (30) ప్రాజెక్టులకు అనుమతులు మంజూరుచేయాలి.
- ప్రస్తుతం కృష్ణా జలాలను తెలంగాణ, ఏపీ 34:66 నిష్పత్తిలో వినియోగించుకొంటున్నాయి. వాటి ఆధారంగానే రూల్ కర్వ్స్‌ను రూపొందించడం అభ్యంతరకరం. సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్-2 అవార్డు అమలులోకి వచ్చేంతవరకూ రెండు రాష్ర్టాలకు 50:50 నిష్పత్తిలో జలాలను కేటాయించాలి. తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఈ మేరకు రూల్ కర్వ్స్‌ను సవరించాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

