నిర్మల్ అర్బన్, ఆగస్టు 23: ఈ నెల 31 లోపల రై తులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయకుంటే హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని బీజేపీ సభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి హెచ్చ రించారు.
రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద రైతులు చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.