సీఎం కేసీఆర్ రుణ మాఫీ చేయడంతో యావత్ తెలంగాణ రైతాంగం హ్యాపీగా సంబురాలు చేసుకుంటున్నది. అన్నదాతలకు ఏ కష్టమూ రాకుండా.. వ్యవసాయానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ.. రైతులను కడుపులో పెట్టి చూసుకుంటున్న రైతు బాంధవుడిని మనసారా కీర్తిస్తున్నది.

రెండో రోజు రుణ మాఫీ ప్రక్రియ కొనసాగడంతో.. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేస్తూ తమ అభిమాన నేతకు కృతజ్ఞతలు తెలిపారు. సంబురాల్లో కూలీలతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి.
– నమస్తేతెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్