హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగా ణ): కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెం టీ పథకాలన్నీ ఉ త్త గ్యాస్ అని తేలిపోయాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు. అక్కడ అమలు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు ఐదు గ్యారెంటీలు అమలుగాక మోసపోయామని నేడు గ్రహించారని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజానీకం కుదుటపడగానే కాంగ్రెస్ నేతలు హామీల పేరుతో గారడీలు చేసేందుకు వస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు విజ్ఞతతో ఆలోచించి రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కొనసాగింపు కోసం మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు.