హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): దళితుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సూచించారు. మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కమిటీ అఫ్ పర్సన్స్ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. దళితుల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పురోగతిపై చర్చించారు.
ఎస్సీ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్‌పై చర్చించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్, జీఎం ఆనంద్, డిప్యూటీ డైరెక్టర్ కిరణ్, నేషనల్ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునీల్‌కుమార్ బాబు, అసిస్టెంట్ సెక్రటరీ అఫ్ ఫైనాన్స్ నాగజ్యోతి, డిప్యూటీ సెక్రటరీ జీఎన్ లలితకుమారి, డైరెక్టర్ అఫ్ గ్రౌండ్‌వాటర్ డాక్టర్ ఎం పండిత్, ఇరిగేషన్ వీసీ అండ్ ఎండీ విద్యాసాగర్, అగ్రికల్చర్ డైరెక్టర్ విజయగౌరీ, లెదర్ ఇండస్ట్రీస్ వీసీ, ఎండీ శ్రీనివాస్, ఎస్సీడీఆర్వీ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.