అగ్నిప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు
హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్‌లలో అగ్నిప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 14 న ప్రారంభమైన అగ్నిమాపకశాఖ వారోత్సవాలు శనివారంతో ముగిశాయి.
- త్వరలో 104 మీటర్ల ఎత్తయిన వాహనం కొనుగోలు
- అగ్నిమాపక వారోత్సవాల ముగింపులో డీజీ నాగిరెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్‌లలో అగ్నిప్రమాదాల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 14 న ప్రారంభమైన అగ్నిమాపకశాఖ వారోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫైర్ రెస్క్యూ కోసం 104 మీటర్ల ఎత్తు న్న కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు 39 ఫైరింజన్లు, 18 మినీ ఫైరింజన్లు, ఇతర రెస్క్యూ సామగ్రి అందుబాటులో ఉ న్నాయని తెలిపారు.
ప్రతి హైరైజ్ బిల్డింగ్‌లో వాటర్ పంప్‌హౌజ్‌లు, ఫైర్ ఫైటింగ్ వ్యవస్థ ను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్న ట్టు తెలిపారు. నగరంలో ఇప్పటివరకు 6 వేల హైరైజ్ బిల్డింగ్లు, 200 మీటర్ల ఎత్తున్న 23 బిల్డింగ్‌లకు అనుమతులు ఇచ్చామని వెల్లడించారు. భవిష్యత్తులో మరో 3వేలకు పైగా భవనాలు నిర్మించే అవకాశం ఉందని, 15 మీటర్లకు పైగా ఎత్తు ఉండే బిల్డింగ్‌లకు ఎన్వోసీ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల మంది కమ్యూనిటీ వలంటీర్లను సిద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం వరంగల్‌లో 93 మంది శిక్షణ పూర్తి చేసుకున్నారని వెల్లడించారు. అగ్నిమాపకశాఖ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్, అడిషనల్ డైరెక్టర్ జీవీ నారాయణరావు, ఆర్ఎఫ్ఓలు హరినాథ్‌రెడ్డి, సుధాకర్‌రావు, డీఎఫ్ఓలు, ఏడీఎఫ్లు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sobhita Dhulipala | పెళ్లి తర్వాత శోభిత ధూళిపాళ బోల్డ్ ఫోటోషూట్.. షాక్‌లో అక్కినేని అభిమానులు
BRS Protest | రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. చెల్పూరులో జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ధర్నా
Niti Taylor | సినిమా అవకాశం కోసం అసభ్యకరమైన షరతు.. చేదు అనుభవాన్ని బయటపెట్టిన నీతి టేలర్!
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

