హైదరాబాద్, ఆగస్టు 6(నమస్తే తెలంగాణ): అఖిల భారత ఎనిమిదో జాతీయ ఓబీసీ మహాసభను సోమవారం తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్, అఖిల భారత బీసీ ఫెడరేషన్, తెలంగాణ-ఏపీ బీసీ సంక్షేమ సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాల్లో జాతీయ ఓబీసీ మహాసభలను నిర్వహిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ ఆదివారం తెలిపారు.
మహాసభకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల నేతలు, కేం ద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, సామాజిక ఉద్యమ సంఘాల నేతలు హాజరవుతున్నట్టు పేర్కొన్నారు.