బౌలింగ్లో చెలరేగిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే.. క్రికెట్ టోర్నీలో బాలరాజు సూపర్ షో
All India Cricket Tournament | జిల్లాలోని అచ్చంపేటలో జరుగుతున్న ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్లో ఎమ్మెల్యే గువ్వల సత్తా చాటారు.

నాగర్కర్నూల్ : ఎమ్మెల్యేగా నిత్యం ప్రజా సమస్యల్లో బిజీగా ఉంటూనే మరోవైపు క్రీడాకారుడిగా తనదైనశైలిలో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు జిల్లాలోని అచ్చంపేటలో జరుగుతున్న ఆల్ ఇండియా క్రికెట్ టోర్నమెంట్లో ఎమ్మెల్యే గువ్వల సత్తా చాటారు.
అచ్చంపేట స్టేడియంలో మహారాష్ట్ర, ఆర్ఫాన్ సీసీ జట్లు పోటీపడ్డాయి. ఆర్ఫాన్ సీసీ జట్టులో సభ్యుడిగా ఎమ్మెల్యే ఆడారు. మ్యాచ్లో 16 బంతులు వేసి 21 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పారు. బౌలింగ్లో రాణించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం చేసుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందిన ఎమ్మెల్యే ను ఇతర క్రీడాకారులు అభినందించారు.
ఈ టోర్నమెంట్లో ఎమ్మెల్యే ఆడిన మూడు మ్యాచ్లలో ప్రతి మ్యాచ్లో రెండు వికెట్ల చొప్పున తీసి, ఆదివారం జరిగిన మ్యాచ్లో నాలుగు వికెట్లు పడగొట్టి మొత్తం ఎనిమిది వికెట్లు తీశారు. రసవత్తరంగా కొనసాగుతున్న ఈ టోర్నమెంట్లో ఎమ్మెల్యే క్రీడాకారుడిగా తన సత్తాను చాటి ఇతర క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

