హైదరాబాద్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్తి కొనుగోలు కేంద్రాలను సోమవారం లోగా ప్రారంభించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు మార్కెటింగ్ శాఖ అధికారుల ను హెచ్చరించారు. శనివారం సచివాలయంలో పత్తి కొనుగోళ్లపై సమీక్ష ని ర్వహించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ఇచ్చి న 279 జిన్నింగ్ మిల్లులు నవంబర్ 4 వరకు ప్రారంభించాలని, ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతకుముందు కొత్తగా నియమితులైన వ్యవసాయ అధికారులకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన ఓరియంటేషన్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రాన్ని వ్యవసాయరంగం లో అగ్రగామిగా నిలబెట్టే ప్రభుత్వ సంకల్పంలో అధికారులంతా భాగస్వాములు కావాలని కోరారు.