RS Praveen Kumar | బీఆర్ఎస్ నేతలపై పెట్టే కేసుల ఎఫ్ఐఆర్లు గాంధీభవన్‌లోనే రెడీ అవుతున్నాయని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో సీక్రెట్ ఎఫ్ఐఆర్లు తయారవుతున్నాయని.. వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న అక్రమ కేసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై పెడుతున్న కేసులన్నీ తప్పుడు కేసులే అని ఒక మాజీ పోలీసు అధికారిగా చెబుతున్నానని స్పష్టం చేశారు. .
కొణతం దిలీప్‌పై ఆదిలాబాద్ జిల్లాలో అక్మ కేసులు పెట్టారని.. ఆయన్ను నిర్మల్ పోలీసులు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. నిర్మల్ కోర్టు మెజిస్ట్రేట్ దిలీప్‌కు బెయిల్ ఇస్తే వెంటనే కడెం పోలీసులు వచ్చారని పేర్కొన్నారు. ఇదెక్కడి ఆటవిక న్యాయమని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలనలో సీక్రెట్ ఎఫ్ఐఆర్లు అవుతున్నాయని మండిపడ్డారు. వాట్సాప్‌లో స్టేటస్లు పెట్టినా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
💥 బీఆర్ఎస్ నేతలపై పెట్టే అక్రమ కేసుల ఎఫ్.ఐ.ఆర్లు గాంధీ భవన్ నుంచే రెడీ అవుతున్నాయి.
💥 కొణతం దిలీప్‌పై ఆదిలాబాద్ జిల్లాలో అక్రమ కేసులు పెట్టారు. వారిని నిర్మల్ పోలీసులు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.
💥 నిర్మల్ కోర్టు మేజిస్ట్రేట్ దిలీప్‌కు బెయిల్ ఇస్తే వెంటనే కడెం… pic.twitter.com/bpVwN2Uc79
— BRS Party (@BRSparty) June 15, 2025
ఫోర్త్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి ఫోర్ బ్రదర్స్ సిటీ అంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి రూ.200 కోట్లతో అందాల పోటీలు పెట్టి తెలంగాణకు తలవంపులు తీసుకొచ్చారని మండిపడ్డారు. ఇంగ్లండ్‌కు చెందిన మ్యాగీ మిల్లా అనే మిస్ వరల్డ్ కంటెస్టెంట్ తనకు అవమానం జరిగిందని పోటీ నుంచి తప్పుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు అసభ్యంగా ప్రవర్తించడంతో మ్యాగీ మిల్లా అందాల పోటీ నుంచి తప్పుకున్నారని పేర్కొన్నారు. స్ ఇంగ్లండ్ మాగీ మిల్లాకు తెలంగాణ ప్రజల తరపున కేటీఆర్ క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. కేటీఆర్ అమెరికా వెళ్లి తెలంగాణ గురించి మాట్లాతున్నందుకు, చెన్నై వెళ్లి దక్షిణ భారత దేశానికి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడుతున్నందుకు కేసులు పెడుతున్నారా అని ప్రశ్నించారు. ఫార్ములా ఈ కార్ రేస్ పై అసెంబ్లీలో చర్చ ఎందుకు పెట్టలేదని రేవంత్ రెడ్డిని నిలదీశారు. కేటీఆర్ లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమని అంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
ఫార్ములా ఈ కార్ రేస్ లో అసలు నిందితుడు రేవంత్ రెడ్డి అని కేసు పెట్టాను ….కానీ నాకు తెలియకుండానే పోలీసులు కేసును క్లోజ్ చేశారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సీఎం కాబట్టి కేసు పెట్టలేదని పోలీసులు అంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, ఇంకొకరికి ఇంకో న్యాయం చట్టంలో ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి సోదరుల దౌర్జన్యంతో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని.. అతనిపై చర్యలేవని నిలదీశారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే లై డిక్టేటర్ టెస్ట్ కు, బహిరంగ విచారణకు రావాలని సవాలు విసిరారు. కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసులను వెంటనే విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్‌పై పెట్టిన కేసులపై న్యాయస్థానాలను తప్పకుండా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.