గోరఖ్‌పూర్, నవంబర్ 4: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన ప్రతిపక్ష కూటమి ఇండియాలో చీలికలు తప్పేట్లు లేవు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీపార్టీ శనివారం కీలక ప్రకటన చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలకు తమ పార్టీ సన్నద్ధమవుతున్నదని పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు.
‘మేమైతే 80 స్థానాలకూ సన్నద్ధమవుతున్నాం. అందులో భాగస్వామ్య పార్టీలకు ఎన్ని సీట్లు వెళతాయన్న విషయం తర్వాత తెలుస్తుంది.’ అని ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు మూడు వేల పెన్షన్ అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.