హైదరాబాద్, జూలై29 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడితప్పింది.. పోలీసులు రోజురోజుకూ పెట్రేగిపోతున్నరు.. 11దాటితే చాలు.. నిస్సహాయులపై లాఠీలతో జులుం చేస్తున్నరు. పేద యువకులపై పోలీసుల జులుం ఏంది? దాడులు ఇలాగే కొనసాగితే కోర్టుకు వెళ్తా. ఇక నుంచి ఎట్ల దాడి చేస్తరో చూస్తా..’ అంటూ ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో సర్కారుపై నిప్పులు చెరిగారు. పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, బీసీ వెల్ఫేర్ తదితర శాఖలకు సంబంధించిన బడ్జెట్ పద్దులపై అసెంబ్లీలో సోమవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. పాతబస్తీలో ప్రజలు రాత్రి 11తర్వాత ఇంటి ముం దు నిలబడ్డా పోలీసులు కొడుతున్నారని, ‘ఫ్రెండ్లీ పోలీసులం కాదు’ అని ప్రకటించుకు నే స్థాయికి వెళ్లారని మండిపడ్డారు. పోలీసు లు దౌర్జన్యాలను ఆపకుంటే తానే రాత్రి 11 తర్వాత రోడ్లపైకి వస్తానని, పోలీసులు ఎట్ల కొడుతరో చూస్తానని హెచ్చరించారు.
నేరాలను అదుపు చేయడమే పోలీసుల ఉద్దేశమైతే అది పెద్ద కష్టమేమీ కాదని, ఎందుకంటే చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేస్తున్నారో వారికి బాగా తెలుసునని, కానీ అక్రమార్కుల నుంచి ప్రతి స్టేషన్‌కు మామూళ్లు వెళ్తున్నందునే సామాన్యులపై తమ ప్రతాపం చూపుతున్నారని ఆరోపించారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే అమాయకులను కొట్టే బదులు వారిని ఎదురోవాలని సవాల్ చేశారు. పోలీసు కమిషనర్ కార్యాలయం సమీపంలో దుకాణాలు అర్ధరాత్రి వరకు తెరిచి ఉంటాయని, ఇతర చోట్ల మాత్రం మూసివేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఒకే రోజు మూడు హత్యలు జరిగితే ఇక లా అండ్ ఆర్డర్ ఎక్కడుందని ప్రశ్నించారు. నగరంతో పాటు చార్మినార్ పరిసర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని, పర్యాటకులకు వసతులు కల్పించాలని, పేదలకు ఉచిత విద్య అందిస్తున్న పాఠశాలలను అనుమతుల పేరిట వేధించవద్దని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం అ మలుచేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ ని ధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఓవైసీకి కేటీఆర్ ఆలింగనం
ప్రసంగం అనంతరం సభ నుంచి బయట కు వెళ్తున్న క్రమంలో అక్బరుద్దీన్‌తో కేటీఆర్‌తో ముచ్చటించారు. లా అండ్ ఆర్డర్, ఇతర అంశాలపై ఓవైసీ ప్రసంగానికి అభినందలు తెలిపారు. సీటు నుంచే ఆయనను ఆలింగనం చేసుకుని అభినందించారు.