హైదరాబాద్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): ప్రభుత్వం కులగణన సర్వే లో తప్పుడు లెక్కలు చూపిందని ఎంఐ ఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ఓవైసీ ఆక్షేపించారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా సర్వే చేశామని చెప్పిన ప్రభుత్వం.. పూర్తినివేదికను సభలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీ చర్చలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం కులగణన సర్వేకు చట్టబద్ధత కల్పించి చర్చ పెడుతుందని భావించినట్టు తెలిపారు. రాష్ట్రంలో 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఎలక్షన్ కమిషన్ చెబుతుంటే సర్వేలో మాత్రం మొత్తం జనాభాను 3.54 కోట్లని చూపడం నమ్మశక్యంగా లేదన్నారు. ఇప్పుడు ముస్లింలతో కలిపి బీసీల సంఖ్య 56.33 శాతం ఉన్నదని చూపడం సరికాదని అన్నారు.
ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి తక్షణమే అమల్లోకి తేవాలని ఉపాధ్యా య ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. కులగణనలోని సందేహాలను నివృత్తికి సర్వేను రీ వెరిఫికేషన్ చేయాలని కోరారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా ఇవ్వకుండా సర్కారు మోసం చేసిందని బీఆర్ఎస్ నేత, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ ఆరోపించారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు తూట్లు పొడుస్తూ బీసీ రిజర్వేషన్లను ఎగ్గొట్టిందని మండిపడ్డారు.