హైదరాబాద్,సెప్టెంబర్ 10 (నమస్తేతెలంగాణ):టీజీపీఎస్సీ గ్రూప్ 1 తప్పిదాలకు రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి స్పష్టంచేసింది. టీజీపీఎస్సీలో వరుస తప్పిదాలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపించింది. వెంటనే టీజీపీఎస్సీని ప్రక్షాళన చే యాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్‌లో బుధవారం ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లాఖాద్రీ, కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మీడియాతో మాట్లాడారు.
గ్రూప్ 1 మెయిన్స్‌పై కోర్టు తీర్పుతో అభ్యర్థులు గందరగోళంలో పడ్డారని తెలిపారు. గత తప్పిదాలు పునరావృతం కాకుండా యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా నియామకాలు చేపట్టేలా, కోర్టు కేసులు రాకుండా నియామకాలను చేపట్టాల ని డిమాండ్ చేశారు. లేకుంటే నిరుద్యోగులతో ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు.