రామగుండంలో ప్రధాని మోదీ అడ్డుకుంటాం: కార్మిక సంఘాల నాయకులు
Godavarikhani | ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది.
గోదావరిఖని: ప్రధాని మోదీ రామగుండం పర్యటన పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న మోదీ.. ఈ నెల 12న రానుండటంతో కార్మికలోకం భగ్గుమంటున్నది. ప్రధానమంత్రిని అడ్డుకుని తీరుతామని జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎన్టీయూసీ నాయకులు స్పష్టం చేశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రపన్నుతున్న మోదీ కార్మిక వ్యతిరేక విధానాలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. గోదావరిఖనిలో కార్మిక సంఘాల నాయులు మీడియాతో మాట్లాడారు.

రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీని అడ్డుకొని నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు. ఏడాది క్రితమే ఉత్పత్తిని ఆరంభించిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు. బొగ్గు పరిశ్రమను, సింగరేణి, ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకోవాలంటే ప్రధానికి నిరసన సెగ తగలాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు గోదావరి ఖనిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- AITUC
- Godavarikhani
- INTUC
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

