హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో గత వీసీ హయాంలో సీనియర్ ప్రొఫెసర్ల పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై నియమించిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీని బహిర్గత పర్చాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
శనివారం తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.