హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు విద్యార్థుల కోసం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాల అమలుపై ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే నిర్ణయం ప్రకటించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
నీట్ పరీక్ష, నూతన జాతీయ విద్యావిధానం రద్దుపై, పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు.