బీబీనగర్ : మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్‌లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ దేశం, సమాజ అభి వృద్ధికి దేశభక్తి యొక్క ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం అధ్యాపకుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
వివిధ విభాగాల్లో పనిచేసిన కొవిడ్ వారియర్స్‌కు ప్రశంసా పత్రాలను అందజేసారు. కార్యక్రమంలో డీన్ డాక్టర్ రాహుల్ నారంగ్, డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ అనంత రావు, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నీరజ్ అగర్వాల్, డాక్టర్లు రష్మి కుందాపూర్, ప్రశాంత్, పీఆర్వో శ్యామల, అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.