e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, January 20, 2022
Home టూరిజం అహో..! అనిపించే అష్టలింగేశ్వరాలయాలు

అహో..! అనిపించే అష్టలింగేశ్వరాలయాలు

జలాల్‌పురంలోని అష్టలింగేశ్వరాలయాలు
  • రెండు సముదాయాలుగా నిర్మితమైన అద్భుత అష్టలింగేశ్వరాలయం
  • కాకతీయుల కాలంలో రెడ్డి రాజులు నిర్మించినట్లు చెప్తొన్నచరిత్ర
  • ఆలయాల్లో నేటికి చెక్కుచెదరని అలనాటి శిల్పకళా నైపుణ్యం
  • పురావస్తు ,దేవాదాయ, పర్యాటక శాఖల కోసం ఎదురుచూపులు
  • తిరుమలగిరి మండలం జలాల్‌పురంలో చారిత్రక అపురూప దేవాలయాలు


తిరుమలగిరి : ఇప్పటికీ అహో..! అనిపించేంతటి అధ్బుత నిర్మాణం ఆ అష్టలింగేశ్వరాలయం సొంతం. కాకతీయుల కాలం నాటి శిల్పకళతో ఆకర్షించే అంతర్భాగమే కాదు.. సుందరమైన గోపురాలతో తీర్చిదిద్దిన బాహ్య రూపమూ నేటికి కాంతులీనుతోంది. పానగల్లు చాయా సోమేశ్వరాలయం గోపుర నమూనాలను పోలిన ఆ చారిత్రక నిర్మాణాన్ని శ్రీకాటేశ్వర, మారేశ్వర, సూర్యదేవరల ఆలయంగా స్థానికులు చెప్పుకుంటారు. రెండు సముదాయాలుగా అష్ట గోపురాలతో నిర్మితమై .. అలనాటి అష్టలింగాలతో పూజలందుకున్న ఆ ఆలయం.. కాకతీయ సామంతులైన చెరకురెడ్డి వంశీయులు నిర్మించి నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

ఘనమైన కీర్తి కలిగి ఉన్నా.. ప్రస్తుతం ఆ అద్భుతాయం జీర్ణావస్థకు చేరుకుంది. గుప్తనిధుల తవ్వకాలతో సూక్మ శిల్పకళ పొదుగుకున్న నందులు సహ శివలింగాలు సైతం మాయమయ్యాయి. అలనాడు వెలుగు వెలిగినా నేడు ధూప దీపాలు దూరమై.. తన చరిత్రను వెలికితీసి గత వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని దీనంగా వేడు తుంది. తిరుమలగిరి మండలం జలాల్‌పురంలోని జడమెరుగని జగద్విదితం జలాల్‌పురం అష్టలింగేశ్వరాలయం. జలాల్‌పురం ప్రాచీన నామం జమ్మలూ రుగా చెబుతారు.

రాకాసి గుండ్లు
- Advertisement -

చెక్కు చెదరని చరిత్ర గుర్తులు
ఎన్నెన్నో ఘనమైన చారిత్రక ఆనవాళ్లుకు ఆవాసమైన తిరుమలగిరి మండలంలో చెక్కు చెదరని చరిత్ర గుర్తులు నేటికి పదిలంగా ఉన్నాయి. మండల పరిధి జలాల్‌పురంలో ఉన్న అలనాటి శివాలయం సైతం ఘనమైన గత చరిత్రను కలిగి ఉంది. పూర్వనామం జమ్మలూరుగా ఉన్నజలాల్‌పురం శివారులో ఎత్తైన పరుపుబండపై 20ఎకరాల్లో నిర్మించిన అష్ట లిం గే శ్వరాలయం దీన్ని కాంతి పరిక్షేపణ ఆధారంగా నిర్మించిన ఛాయ చతురుకోట దేవాలయాలుగా కూడా చెబుతుంటారు.

శాస్త్రీయతతో పాటు అధ్యాత్మికత జోడించి అపురూపంగా నిర్మించిన దేవాలయంగా చెప్పవచ్చు. రాకాసి గుండ్లు, ఆది మా నవుల ఆనవాళ్లు కూడ ఇక్కడ ఉన్నాయి. దీనిని పర్యాటక కేంద్రంగా మార్చగల్గితే దేశ విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించగలిగే చారిత్రక ఆలయాలుగా పేరుగాంచుతాయని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. స్థానికులు వీటిని మల్లికార్జున ఆలయంగా పిలుచుకుంటున్నారు.

కాకతీయుల కాలంలో నిర్మితమైన ఆనవాళ్లు నల్లగొండ జిల్లాతో పాటు కాకతీయుల చరిత్ర పైనా అనేక పుస్తకాలు రచించిన చరిత్రకారులు.. జలాల్‌పురం ఆలయ ప్రశస్తిని ప్రస్తావించారు. 12వ శతాబ్దంలో కాకతీయుల సామంతులైన రెడ్డి రాజుల్లో చెరుకురెడ్డి వంశీయులు దీన్ని నిర్మించినట్లుగా పలువురు పేర్కొన్నారు.

ఆలయం ఆవరణలో ఉన్న నీటి కొలను.

రెడ్డి రాజుల్లో బొల్లారెడ్డి, తన రాజ్య పరిధిలోని జమ్మలూరు (నేడు జలాల్‌పురం)లో రాతి గుట్టపై 8 మండపాలతో సువిశా లంగా ఆలయాన్ని నిర్మించినట్లు స్పష్టంగా రాసి ఉంచారు. ఇమ్మడి విశ్వనాథం అనే వ్యక్తి దేవాలయం నాలుగు వైపులా శాసనాలు వేయించినట్లు చరిత్ర చెప్తోంది.

సంస్కృత భాషలో రాసి ఉన్న ఆ శాసనాల్లో గణపతి , రుద్ర దేవుల శౌర్యాన్ని ప్రస్తావించినట్లు అక్కడక్కడా పుస్తకాల్లో రాసి ఉంది. శాలివాహన శకం 1124 లో రాజు బొల్లారెడ్డి సైతం మరో శాసనం వేయించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
పట్టించుకుంటే దేదీవ్యమానంగా వెలుగొందటం ఖాయం

ఆలయం ఉన్న బండపరుపు రాయి


ఈ ఆలయ దూప దీపనైవేద్యాల కోసం భూములు కేటాయించిన ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో తెలియని వైనం. గత నాలుగైదు సంవత్సరాల నుంచి గ్రామస్తులు ఆలయ కమిటీ వేసుకోని విద్యావంతుడైన వ్యక్తి సత్యంను చైర్మెన్‌గా ఎన్నుకో ని మహశివరాత్రి రోజున పెద్ద ఎత్తున వారం రోజులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి ప్రజలు మల్లికార్జున దేవాలయంగా పిలుచుకుంటున్నారు.


అద్భుతమైన శిల్ప కళను దాగి ఉన్న ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ వారసత్వ సంపద పరిధిలో చేర్చి తవ్వకాలు చేపడితే ..మరింత చరిత్ర వెలుగులోకి రానుంది. దేవాదాయ , పర్యాటక శాఖలు సైతం పట్టించుకుంటే అలనాడే జగ ద్వితంగా వెలుగొందిన ఈ అష్టలింగేశ్వరాలయం.. మళ్లీ దేదీప్యమానంగా వెలుగొందటం ఖాయం.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement