Rains | వానలొస్తున్నాయ్.. ఇలా చేస్తే పంటలను రక్షించుకోవచ్చంటూ రైతులకు వ్యవసాయ వర్సిటీ సూచనలు
వర్షాల నేపథ్యంలో పంటల రక్షణకు వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Rains | హైదరాబాద్, జులై 24 (నమస్తే తెలంగాణ): వర్షాల నేపథ్యంలో పంటల రక్షణకు వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పంటల రక్షణ చర్యలను సూచిస్తున్నారు. పొలాల్లోకి వచ్చిన నీటిని లోతు కాలువల ద్వారా బయటికి తీసివేయాలని చెప్పారు. సాధ్యమైనంత తొందరగా అంతరకృషి చేసుకోవాలని కోరారు. 20 రోజులు దాటిన పంటలకు ఇప్పుడు ఎరువులను వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వెల్లడించారు.
స్వల్పకాలిక వరి విత్తనాలతో మేలు
ఈ వర్షాలు వరి సాగుకు అనుకూలంగా మారాయి. ఇది వరకే నార్లు పోసుకున్న వారు నాట్లు పూర్తి చేసుకోవాలి. నార్లు పోసుకున్న వారు నాట్లు పూర్తి చేసుకోవాలి. నార్లు మొదలు పెట్టని వారు స్వల్పకాలిక విత్తనాలు వెదజల్లుకోవాలి. ఎకరాకు సరిపోయే నారుమడిలో 800 గ్రా. కార్బోఫ్యూరాన్ గుళికలు నారును తీయడానికి ఐదు నుంచి వారం రోజులు ముందుగా చల్లుకోవడం ద్వారా ఉల్లికోడు మొగిపురుగు తాకిడిని తగ్గించవచ్చు. స్వల్పకాలిక వరి రకాలు (జగిత్యాల 24423, మారుటేరు 1010, కునారం 118, 1638 మొదలగునవి) నార్లు. ముదిరిన నారుతో నాట్లు వేయొద్దు. తప్పనిసరి పరిస్థితులలో ఇలాంటి నార్లతో నాటు వేసినప్పుడు నత్రజనిలో 2/3వ వంతు అంటే ఒకటిన్నర (1 1/2) బస్తా యూరియా సూచించిన భాస్వరం పొటాష్లను నాటుకు ముందుగా వేసుకోవాలి.
పత్తిలో నీటి నిల్వ ఉండొద్దు
పత్తి చేనులో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షానికి పడిపోయిన మొక్కల్ని నిలబెట్టి చుట్టు మట్టి వేయాలి. వర్షం తగ్గిన సమయంలో ఒక ఎకరానికి పైరిథయోబాక్ సోడియం+క్విజలాఫాప్ ఈథైల్ 500 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి.
సోయాచికుడు : ఇమాజితాఫిర్+ప్రొపాక్విజోఫాప్ 800 మి.లీ. లేదా ఇమాజితాఫిర్+ఫిర్ క్విజలాఫాప్ ఈథైల్ 175 మి.లీ పిచికారీ చేయాలి.
మకజొన్న : సోట్రయాన్+అట్రాజిన్ 1400 మి.లీ. లేదా టెంబోట్రయాన్+అట్రాజిన్ 115 మి.లీ.+500గ్రా. పిచికారీ చేయాలి.
కంది/పెసర/మినుము: ఎకరానికి ఇమాజితాఫిర్ 300 మిల్లీలీటర్ల చొప్పున స్ప్రే చేయాలి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

