రేడియల్ రోడ్ల టెండర్లపై హైకోర్టు వెంటనే విచారించాలి!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య మొదలైన వైరం మరింత ముదిరింది.
- ప్రాధాన్యతా క్రమంలో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశం
- రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు
- టెండర్లు దక్కించుకున్న సంస్థలనూ ఇంప్లీడ్ చేయాల్సిందే
- ఈక్విటీలు క్లెయిమ్ చేయవద్దన్న సర్వోన్నత న్యాయస్థానం
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మధ్య మొదలైన వైరం మరింత ముదిరింది. రేవంత్‌రెడ్డిపై, ఆయన పాలనపై ఎప్పటినుంచో విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌రెడ్డి.. తాజాగా తన సంస్థ ‘సుశీ ఇన్ఫ్రా’కు రావాల్సిన కాంట్రాక్టులను సీఎం ఉద్దేశపూర్వకంగా రాకుండా చేశారని ఆరోపించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఆయన హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
రాజగోపాల్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. కేసును హైకోర్టు సింగిల్ బెంచ్‌కు బదిలీ చేస్తూ, వీలైనంత త్వరగా, ప్రాధాన్యతా క్రమంలో విచారణ చేపట్టాలని ఆదేశించింది. ఈ కేసుతో సంబంధమున్న మిగతా 3 కంపెనీలను కూడా ఇంప్లీడ్ చేయాలని చెప్పింది. కేసు విచారణ అంశం తేలేవరకు టెండర్లు దక్కించుకున్న కంపెనీలు ఈక్విటీలు క్లెయిం చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఖజానాకు రూ.600 కోట్ల నష్టం
సుశీ ఇన్ఫ్రా సంస్థ, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చెప్తున్న వివరాల ప్రకా రం.. హైదరాబాద్ నగర శివారులోని కొత్వాల్‌గూడ (బుద్వేల్) వద్ద ఔటర్ రింగ్‌రోడ్డు నుంచి, నాచారం హైవే వరకు 81.15 కిలోమీటర్ల రేడియల్ రోడ్-2 నిర్మాణానికి ప్రభుత్వం హెచ్‌జీసీఎల్ ద్వారా టెండర్లు పిలిచింది. టెండర్లలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి సంబంధించిన సుశీ ఇన్ఫ్రా కంపెనీకి అన్ని అర్హతలు ఉన్నా దాని కన్నా రూ.600 కోట్లు అధికంగా బిడ్ దాఖలు చేసిన ఎల్-1 బిడ్డర్‌కు ప్రభుత్వం టెండర్లను కట్టబెట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

