Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
Israel Results | ఇజ్రాయెల్ ఎన్నికల్లో (Israel Elections) తుది ఫలితాలు వెల్లడయ్యాయి. బుధ, గురువారాల్లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ కూటమికి, పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల ఫుల్ మెజారిటీ రాలేదు. హంగ్ (Hung) ఏర్పడింది. మొత్తం 120 స్థానాలకుగానూ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధానమంత్రి నెతన్యాహు (Nethanyahu) నేతృత్వంలోని అధికార కూటమికి 53 సీట్లు దక్కాయి.
Israel Results : ఇజ్రాయెల్ ఎన్నికల్లో (Israel Elections) తుది ఫలితాలు వెల్లడయ్యాయి. బుధ, గురువారాల్లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ కూటమికి, పార్టీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 61 సీట్ల ఫుల్ మెజారిటీ రాలేదు. హంగ్ (Hung) ఏర్పడింది. మొత్తం 120 స్థానాలకుగానూ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రధానమంత్రి నెతన్యాహు (Nethanyahu) నేతృత్వంలోని అధికార కూటమికి 53 సీట్లు దక్కాయి. నెతన్యాహుకు చెందిన ‘లికుడ్ (Likud)’ పార్టీ 27 సీట్లు గెల్చుకోవడం ద్వారా అతిపెద్ద పార్టీగా నిలిచింది.
ప్రతిపక్ష కూటమి 48 స్థానాలు దక్కించుకుంది. అరబ్ పార్టీలు అనూహ్యంగా 19 సీట్లు సొంతం చేసుకున్నాయి. చివరగా లెక్కించిన ఇజ్రాయెల్ మిలిటరీ సిబ్బంది, రిజర్వు సైనికులు, దౌత్యవేత్తలు, ఆసుపత్రుల్లో ఉన్న రోగులు, వైద్య సిబ్బంది, ఖైదీల వంటివారు వేసిన ‘డబుల్ ఎన్వలప్ బ్యాలెట్స్‌లో నెతన్యాహు కూటమికి సీట్లసంఖ్య పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ డబుల్ ఎన్వలప్ బ్యాలెట్లతోనూ సమీకరణాలు ఏమాత్రం మారలేదు.
ఇప్పుడు హంగ్ ఏర్పడటంతో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి నెలకొన్నది. 19 సీట్లు దక్కించుకున్న అరబ్ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న రైట్ వింగ్, ప్రతిపక్ష లెఫ్ట్ వింగ్ కూటములు విముఖంగా ఉన్నాయి. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష కూటములు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అక్కడి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశాలు జోక్యం చేసుకున్నాయని ప్రధాని నెతన్యాహు మరోసారి ఆరోపించారు. ఇది ‘భూకంపం’ వంటి విపత్తు అని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు, అంతర్గత భద్రతా విభాగం దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. అరబ్ పార్టీలు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డాయని విమర్శించారు. ఇజ్రాయెల్ ఇస్లామీకరణకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం తాము అరబ్ పార్టీలతో చేతులు కలపబోమని స్పష్టంచేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BTech Admissions | ఇంజినీరింగ్ చదువుకు తగ్గుతున్న క్రేజ్.. భారీగా తగ్గుతున్న బీటెక్ అడ్మిషన్లు
Israel Results | ఇజ్రాయెల్‌లో తుది ఫలితాలు వెల్లడి.. ఏ పార్టీకీ దక్కని మెజారిటీ.. ప్రభుత్వ ఏర్పాటు అసాధ్యమేనా..!
SIR Enumeration | తెలంగాణలో ‘సర్’ షెడ్యూల్ పొడిగింపు
రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వివాదంలో కీలక మలుపు.. రేడియల్ రోడ్ల టెండర్లపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Kodangal |సీఎం ఇలాకాలో బుల్డోజర్ల మోత.. ఆడపిల్లలు ఉంటారన్న సోయి మరిచి బాలికల హాస్టల్‌పై ప్రతాపం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

